G20 Summit: పెళ్లి కూతురిలా ముస్తాబైన ఢిల్లీ.. వైరల్గా మారిన ఫొటోలు, వీడియోలు..!
జీ20 సమ్మిట్కి దేశ రాజధాని అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(10) ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. దీంతో కుతుబ్ మినార్(Qutab Minar) నుంచి ఇతర చారిత్రక కట్టడాల వరకు దాదాపు అన్నిటికి లైట్ ఎఫెక్ట్స్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్మీడియాలో వైరల్గా మారాయి.