భారత జట్టులో స్టార్ ప్లేయర్‌లా పేరు తెచ్చుకున్న బ్యాటర్ రిషబ్ పంత్. అతను వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై చర్చ జరుగుతూనే ఉంది. కానీ పంత్ మునుపటిలా బ్యాట్ జులిపించాలంటే ఎక్కువ సమయం పడుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. పంత్ వన్డే ప్రపంచకప్ టీమ్‌లో లేకపోతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. పంత్‌కు ప్రత్యామ్నాయ కీపర్లుగా కేఏల్ రాహుల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు ఉన్నారు. కానీ సంజూ శాంసన్ రాణించలేకపోతున్నాడు. దీంతో బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను అతనికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు జరుగనున్న ఈ మినీ ఈవెంట్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వస్తే ప్రపంచకప్ జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదని కచ్చితంగా చెప్పవచ్చు. కాగా వికెట్ కీపర్లపై స్పందించిన మాజీలు ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంతే అంటున్నారు. పంత్‌తో పాటు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ సైతం రాణించగలరన్న మాజీలు.. కానీ వీళ్లు ఎప్పుడు చేతులెత్తేసేది తెలియదన్నారు. ధొనీ వారుసుడిగా పేరుతెచ్చుకున్న పంత్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆపద్భాందవుడిలా ఆదుకుంటాడని, గతంలో రిషబ్ శ్రీలంకపై రాణించిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రపంచకప్‌కు పంత్ అందుబాటులో లేకుంటే భారత్‌కు భారీ నష్టం జరిగినట్లే అవుతుందన్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ వరల్డ్ కప్‌కు ఎంపికైతే.. అతను ఓపెనర్‌గానే వచ్చే అవకాశం ఉంది. దీంతో 6వ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మొదటి ఐదు స్థానాల్లో బ్యాటర్లు ఉండగా ఆరో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటింగ్‌కు రావాలి. కానీ కేఎల్ రాహుల్ ఓపెనర్ కావడం, అతను మిడిలార్డర్‌లో రాణించలేకపోతుండటంతో మిడలార్డర్ బాధ్యత ఇప్పుడు ఆల్ రౌండర్‌లు తీసుకుంటున్నారు. ఆ స్థానంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు వస్తున్నారు.