Pets Animals: పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది?

పెంపుడు జంతువులతో కలిసి పడుకోవడం వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాల బారిన పడతామని నిపుణులు అంటున్నారు. పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రు నుంచి వచ్చే ధూళి వంటిది అలెర్జీ, ఆస్తమా బాధితుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో దగ్గు, తుమ్ములు, శ్వాస ఇబ్బందులు వస్తాయి.

New Update
Pets Animals: పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది?

Pets Animals:  పెంపుడు జంతువులు మనకు మంచి స్నేహితులు. వాటితో సమయం గడపడం వల్ల మనకు ఆనందంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే పెంపుడు జంతువులతో కలిసి పడుకోవడం వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాల బారిన పడతామని నిపుణులు అంటున్నారు.

publive-image

అలెర్జీలు, ఉబ్బసం:

పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రు నుంచి వచ్చే ధూళి వంటిది అలెర్జీ, ఆస్తమా బాధితుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. గాల్లోకి ఉన్న ఈ కణాలు ఊపిరితిత్తుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది దగ్గు, తుమ్ములతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

జెర్మ్స్:

పెంపుడు జంతువుల బొచ్చులో చాలా పరాన్నజీవులు, ఈగలు, పేలు మొదలైన ప్రమాదకరమైన జెర్మ్స్ దాగి ఉంటాయి. ఈ చిన్న కీటకాలు పెంపుడు జంతువులను ఇబ్బంది పెట్టడమే కాకుండా అవి మనుషులకు కూడా వ్యాపిస్తాయి. ఇది చర్మ వ్యాధులకు, ఇతర వ్యాధులకు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. అందుకే పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సలహా ఇస్తున్నారు.

publive-image

నిద్ర లేకపోవడం:

పెంపుడు జంతువులతో కలిసి పడుకోవడం వల్ల చాలా మందికి నిద్రకరవు అవుతుంది. పెంపుడు జంతువుల కదలికలు, శబ్దాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. దానివల్ల ప్రశాంతంగా పడుకోలేకపోతారు. దీని వల్ల మరుసటి రోజు శక్తి కోల్పోవడమే కాకుండా మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

నిద్రపోయే ముందు పెంపుడు జంతువును పూర్తిగా శుభ్రం చేయాలి. ప్రతిరోజూ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాటి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు అలెర్జీలు లేదా ఆస్తమా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.పెంపుడు జంతువులతో పడుకోవడం మీ నిద్రకు భంగం కలిగిస్తే వాటిని దూరంగా ఉంచాలని నిపుణులు అంటున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: కట్‌ చేసిన పుచ్చకాయను ఎన్ని రోజులు తినవచ్చు?.. ఈ తప్పు చేయకండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు