eat curd in winter: ప్రతీ రోజు మంచి గడ్డ పెరుగు అన్నంలో వేసుకుని తింటే (eat) ఆ కికే వేరుగా ఉటుంది. పెరుగుతో రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. చలికాలం (winter)లో ఎక్కువ మందికి పెరుగును దూరం చేస్తారు. శీతాకాలంలో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయంతో పెరుగు తినటానికి ఇష్ట పడరు. కాగా..ఈ ఆలోచన ఒట్టి అపోహేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పెరుగు తింటే ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. అంతేకాకుండా.. రోజూ పెరుగు తినడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: కోడలి మరణం తట్టుకోలేక అత్త గుండెపోటుతో మృతి.. కాజీపేటలో విషాద ఘటన
దీంతో.. మన శరీరం అనారోగ్య సమస్యలు వస్తే చురుగ్గా ఎదుర్కొంటుందని వైద్యులు (Doctors)చేబుతున్నారు. నిజానికి జలుబు, దగ్గు (Cold, cough) లాంటి సమస్యలను పెరుగు త్వరగా తగ్గిస్తుంది. కొంతమందిని చలికాలంలో మలబద్దకం ఇబ్బందికి గురి చేస్తుంది. పెరుగులో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని పోగొట్టి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెరుగులో కాల్షియం (Calcium) ఎక్కువగా ఉండటం వల్ల శరీర కండరాలకు ( body muscles) బలం వస్తుంది. అంతేకాదు ఎముకలు (bones) కూడా ధృడంగా ఉంటాయి.
రక్తపోటును కంట్రోల్ చేయటంలో పెరుగు బెస్ట్
దంత సమస్యలు ఉన్నా అవి దరిచేరవు. పెరుగు (curd)ను ప్రతీరోజు తినడంతో రక్తంలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్ సమస్యలు కూడా రావని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును కంట్రోల్ చేయటంలో పెరుగు బెస్ట్ అంటున్నారు. అయితే.. ఈ పెరుగును మాత్రం పగటిపూట మాత్రమే తినాలి. రాత్రి తింటే మ్యూకస్ పేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Doctors warn). ఆస్తమా.. ఉన్నవారు కూడా రాత్రి సమయం (night time)లో పెరుగుకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీ మెదడు మరింత చురుగ్గా పనిచేయాలంటే చేయాల్సిన పనులు