Telangana Crime: కోడలి మరణం తట్టుకోలేక అత్త గుండెపోటుతో మృతి.. కాజీపేటలో విషాద ఘటన పండగపూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీపావళి నాడు ఆ ఇంటి ఇల్లాలుతో పాటు కూతుడు, అత్త దారుణంగా మరణించారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పండగ రోజు ఒకే ఇంట్లో ముగ్గురు మరణిచటం కాజీపేట నగరంలో కలకలం రేపింది. By Vijaya Nimma 12 Nov 2023 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి వరంగల్ జిల్లా (Warangal district) దీపావళి పండగ పూట విషాదం చోటుచేసుకుంది. తల్లి కూతురు (Mother and daughter) బంధంచెరువు (Bandhancheru)లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఈ సంఘటన ఆదివారం కాజీపేటలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకెళితే దర్గా గ్రామానికి చెందిన తల్లి రేణుక (40), కూతురు నవ్య (14) దర్గాలోని బంధం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిన వృద్ధురాలైన అత్త గుండెపోటుతో మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు విషయం తెలుసుకున్న పోలీసులు (police)సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వీరంతా దర్గా గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలను పోస్టుమార్టం (Postmortem) కోసం ఎంజీఎం (MGM Hospital) ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ముగ్గురు మృతదేహాలతో దర్గా గ్రామం (Dargah village)లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఏసీపీ డేవిడ్రాజు (ACP Davidraju), కాజీపేట (Kazipet) ఇన్‌స్పెక్టర్ రాజు ( Inspector Raju) వివరాలు సేకరించారు. ఇది కూడా చదవండి: చిన్నారి లక్షిత కిడ్నాప్ కథ సుఖాంతం..పోలీసుల అదుపులో కిడ్నాపర్ #dargah-village #bandhancheru #warangal-district #telangana-crime #mother-and-daughter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి