Health Benefits: చెవిపోటును చిటికెలో పోగొట్టే చిట్కాలు మీ కోసం కొన్ని సందర్భాల్లో మనకు విఫరీతమైన చెవి పోటు వస్తుంది. ఆ నొప్పిని భరించడం కూడా కష్టంగా ఉంటుంది. చెవిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబు, సైనసైటిస్ వలన కూడా చెవిపోటు వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఇలా చేస్తే చెవినొప్పి వెంటనే తగ్గుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కొన్ని సందర్భాల్లో అయితే చెవి నుంచి రక్తం, చీము కూడా వస్తాయి. చెవి నొప్పి కారణంగా జ్వరం కూడా వస్తుంది. చెవిలో పోటు అధికంగా ఉంటే స్నానం చేసేటప్పుడు కచ్చితంగా చెవిలో దూది పెట్టుకోవాలి. ముఖ్యంగా నీళ్లు లోపలికి పోకుండా చూసుకోవాలి. అంతేకాకుండా తరచూ చెవిని క్లీన్ చేస్తూ ఉండాలి. చెవిలో రక్తం, చీము వచ్చినప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల నొప్పి వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది. చెవిపోటును తగ్గించడంలో అల్లం ఎంతో దోహదపడుతుంది. మొదట అరకప్పు అల్లం రసాన్ని గిన్నెలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ రసాన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచాలి. ఇది కూడా చదవండి: గొంతులో నొప్పి వస్తుందా..ఇలా చేస్తే వెంటనే ఉపశమనం ఈ అల్లం రసాన్ని రోజుకు ఐదుసార్లు చెవిలో కొంచెంగా వేసుకోవాలి. అల్లం రసం వేసుకునేటప్పుడు కచ్చితంగా గోరువెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ఇంట్లో దొరికే వెల్లుల్లి రెబ్బలతో కూడా చెవిపోటును ఇట్టే తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి, ఆ మిశ్రమానికి కొంచెం ఉప్పును యాడ్ చేయాలి. దీన్ని ఒక శుభ్రంగా ఉన్న వస్త్రంలో వేసుకుని మూటలా కట్టుకోవాలి. దీన్ని చెవిపై ఉంచడం వల్ల ఇన్‌ఫెక్షన్ వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా నొప్పికూడా తగ్గుతుంది. అంతేకాకుండా తులసి ఆకులను బాగా కడిగి రసం తీసుకోవాలి. దాన్ని కొంచెం చెవిలో వేసుకుంటే ఇన్‌ఫెక్షన్ బాగా తగ్గిపోయి నొప్పి కూడా మటుమాయం అవుతుంది. ఇలా చెవిలో వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది అలాగే చెవిలోంచి చీము రాకుండా అరికట్టడంలో ఇంగువ బాగా పనిచేస్తుంది. ముందుగా ఒక బౌల్‌లో కొంచెం కొబ్బరి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో కొంచెం ఇంగువా వేసి వేడి చేసుకోవాలి. ఇంగువా పొంగు వచ్చాక ఆ నూనెను కొద్దిగా వేడిగా ఉండేవరకు చల్లార్చుకోవాలి. అనంతరం అలా చేసిన నూనెను మన చెవిలో కొన్ని చుక్కలు వేసుకుంటే చీము రావడం ఒక్కసారిగా తగ్గిపోతుంది. మెంతులు కూడా చెవినొప్పికి బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో ఆవ నూనె తీసుకొని బాగా వేడి చేయాలి. అలా వేడైన నూనెలో కొద్దిగా మెంతులను వేసి అవి కలర్‌మారే దాకా వేయించాలి. ఆ నూనెను గొరు వెచ్చగా ఉండగానే చెవిలో పోసుకుంటే చీము రావడం ఆగిపోతుంది, అంతేకాకుండా నొప్పి తగ్గిపోతుంది. ఒక గిన్నెలో ముల్లంగితో తీసిన పేస్ట్‌తో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బల పేస్ట్, మునగాకుల పేస్ట్ వేసి బాగా వేడి చేయాలి, దీన్ని చెవిలో వేసుకోవడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. చెవి నుంచి చెడు వాసన వస్తుంటే వెల్లుల్లి రెబ్బలను ఉంచడం ద్వారా వాసనపోతుంది, అంతేకాకుండా నొప్పి కూడా తగ్గుతుంది. #tips #earwax #health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి