Health News: పారాసెటమాల్ టాబ్లెట్‌ మోతాదు మించి వాడితే ఏమవుతుంది?

పారాసెటమాల్ టాబ్లెట్‌ అధిక వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ ను అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు తీవ్రమైన తలనొప్పి, చిరాకు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని చెబుతున్నారు

Health News:  పారాసెటమాల్ టాబ్లెట్‌ మోతాదు మించి వాడితే ఏమవుతుంది?
New Update

Health News: ఇటీవల స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పారాసెటమాల్ వల్ల కలిగే కాలేయ నష్టంపై అధ్యయనం చేసింది. ఈ టాబ్లెట్‌ వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని, మితిమీరిన వినియోగం తీవ్ర పరిస్థితులకు దారితీస్తుందని అంటున్నారు. తలనొప్పి, బాడీ పెయిన్స్‌, తేలికపాటి జ్వరానికి ప్రజలు తరచుగా పారాసెటమాల్ టాబ్లెట్స్‌ వేసుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పెయిన్ కిల్లర్ ఇది. అయితే కొద్దిపాటి అజాగ్రత్తతో లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మోతాదు మించితే?

పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు ఉంటాయి. కడుపు కుడి వైపున, పక్కటెముకల కింద నొప్పిగా ఉంటుంది. పరిస్థితి విషమిస్తే కాలేయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూర్ఛ, తీవ్ర జ్వరం, వణుకు, తీవ్రమైన తలనొప్పి, చిరాకు, తినడం కష్టం, శ్వాస సమస్యలు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

publive-image

పారాసెటమాల్ ఎవరు వేసుకోకూడదు?

పారాసెటమాల్ కొంతమందికి ప్రమాదకరం. చాలా కాలంగా మద్యం సేవించే వారి కాలేయం ఇప్పటికే పాడైపోయి ఉంటుంది. అలాంటి వారికి పారాసిటమాల్ ఇస్తే వారి పరిస్థితి విషమంగా మారవచ్చని వైద్యులు అంటున్నారు. అలాగే కాలేయ వ్యాధితో బాధపడేవారు పారాసెటమాల్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. అలెర్జీలు ఉన్నవారు కూడా వేసుకోకూడదు. ఏదైనా చికిత్సకు ముందు వైద్యుడిని సంప్రదించాకే టాబ్లెట్‌ వేసుకోవాలని అంటున్నారు.

publive-image

గర్భధారణ నొప్పికి పారాసెటమాల్ వాడవచ్చా?

సాధారణంగా పారాసెటమాల్ గర్భధారణ నొప్పికి సురక్షితం అని చెబుతుంటారు. కానీ దీనిని వాడేముందు రోగి వైద్య చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోగికి కాలేయ సమస్యలు ఉంటే లేదా పారాసెటమాల్‌కు అలెర్జీ ఉంటే వాడకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

publive-image

అధిక మోతాదు మరణానికి కారణమా?

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి పారాసెటమాల్‌ కొత్త ఆయుధంగా మారుతోంది. పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్తారని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్తే కాపాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వేళ్లు విరిచే అలవాటు చెడ్డదా..మంచిదా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #best-health-tips #health-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe