పెళ్లి చేసుకున్నాక చాలామంది అడిగేమాటా 'పిల్లలెప్పుడు' అని. పెళ్లైన కొన్నాళ్లకు పిల్లలు లేని జంటలకు తరుచుగా ఈ ప్రశ్న వేధిస్తుంటుంది. కొంతమంది జంటలకు వివాహం అయ్యాక కొన్ని నెలలు, 1 లేదా 2 రెండు సంవత్సరాల్లోనే సంతానం కలగుతుంది. కానీ మరికొంతమంది జంటలకు మాత్రం చాలా ఏళ్లైన పిల్లలు పుట్టరు. దీనికి రకారకాల కారణాలు ఉంటాయి. అందులో ఓ కీలకమైన అంశాన్ని పరిశోధకులు గుర్తించారు. ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ జన్యు మార్పు కూడా ఈ సంతానలేమికి కారణమవుతున్నట్లు యూనివర్సిటీ హాస్పిటల్ బాన్ పరిశోధకులు తెలిపారు.
Also Read: రాత్రిపూట ఇవి తింటున్నారా?.. జాగ్రత్త!
వాస్తవానికి పురుషుల వృషణాల్లో నిరంతరం వీర్యకణాలు పుట్టుకొస్తుంటాయి. అయితే ఈ ప్రక్రియలో భాగంగానే గుండ్రటి బీజకణాలు పొడవైన వీర్యకణాలుగా మారిపోతాయి. తల, మధ్యభాగం, అలాగే ఈదడానికి ఉపయోగపడే పొడవైన తోక ఏర్పడతాయి. అయితే వీర్యకణలు ఇలా మారాలంటే కొన్ని ప్రోటీన్లు అవసరం అవుతాయి. అయితే వీటిల్లో ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది వీర్యకణం పరిపక్వమయ్యే సమయానికి మనుషులు, ఎలుకల్లో తయారవుతుంది. అందుకే వీర్యకణాలు ఆకారం విషయంలో ఇది ముఖ్య పాత్రను పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. దీన్ని గుర్తించేందుకే జన్యుమార్పిడి చేసిన ఎలుకలపై అధ్యయనం చేశారు. అయితే ఎసీటీఎల్7బీ లేని ఎలుకల్లో వీర్యకణాల ఎదుగల ఆగినట్లు.. అలాగే బీజకణాలు గుండ్రంగానే ఉండిపోతున్నట్లు గుర్తించారు. ఇక మగవారిలో కూడా సంతానలేమికి ఏసీటీఎల్7బీ జన్యు మార్పులు కారణం అవుతున్నాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.