Etala Rajender: మాట్లాడటానికి వెళ్లిన వారిపై దాడి చేయడం ఎంటి ?

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ అడ్మిషన్‌ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Telangana: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్!
New Update

పీహెచ్‌డీ అడ్మిషన్‌ విషయంలో మెరిట్‌ పాటించడంలేదని కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ యూనివర్సిటీ వీసీని కలిసేందుకు వెళ్లిన బీసీ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. బీఆర్‌ఎస్‌కు వీసీ రమేష్‌ తొత్తుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యల గురించి అధ్యాపకులతో మాట్లాడి వాటిని పరిష్కరించుకునే సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు. కానీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విద్యార్థులను కొట్టడం తెలంగాణ చరిత్రలో లేదని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

విద్యార్థులు తలుచుకుంటే సామ్రాజ్యలే కూలిపోయిన రోజులు ఉన్నాయని ఈటల గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులే అన్నారు. వీసీ తీరును యావత్‌ విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. విద్యార్థులను కొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు, వీసీకే చెందుతుందని ఈటల విమర్శించారు. వీసీ పర్మిషన్‌ లేకుండా పోలీసులు యూనివర్సిటీకి ఎలా వచ్చారన్న ఎమ్మెల్యే.. అలాంటిది వీసీ విద్యార్థులను కొట్టించడం ఏంటన్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యకం చేసిన ఈటల రాజేందర్‌ సీఎం కొంత మందికి మాత్రమే రుణ మాపీ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిలో ఉన్న రైతులకు మాత్రమే రుణ మాఫీ చేశారన్నారు. దీంతో చాలా మంది రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నారన్నారు. రైతులు అప్పులు తెచ్చుకోలేక, ఉన్న అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు భూములను అమ్మి అప్పులను చెల్లించాల్సిన దుస్ధితి ఏర్పడిందన్నారు. మరోవైపు వైన్‌ షాప్‌ టెండర్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడిందని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.

#brs #police #students #bjp #cm-kcr #etala-rajender #vc #ramesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe