లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సోమవారం కూచ్‌బెహార్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శించిన బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ' బీజేపీని ఓడించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు. రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రాన్ని తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలు జరగవు. వాళ్లకి వన్ లీడర్, వన్ నేషన్, వన్ భాషన్, వన్ భోజన్ కావాలి' అంటూ మమతా బెనర్జీ విమర్శించారు. ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్‌లో తొలిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది.
Also Read: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్