Wells Fargo Bank: బ్యాంకు ఉద్యోగులకు షాక్.. తప్పుడు పని చేసినందుకు ఊడిన జాబ్స్‌

అమెరికాకు చెందిన వెల్స్‌ ఫార్గో అనే బ్యాంక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. పనిచేస్తున్నట్లు కనిపించేలా 'సిమ్యులేటెడ్ కీ బోర్డు యాక్టివిటీ'కి పాల్పడినందుకు 12 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.

New Update
Wells Fargo Bank: బ్యాంకు ఉద్యోగులకు షాక్.. తప్పుడు పని చేసినందుకు ఊడిన జాబ్స్‌

Wells Fargo Fires Workers: అమెరికాకు చెందిన వెల్స్‌ ఫార్గో అనే బ్యాంక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. పనిచేస్తున్నట్లు కనిపించేలా 'సిమ్యులేటెడ్ కీ బోర్డు యాక్టివిటీతో' వర్క్ చేస్తున్నందుకు 12 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. వీళ్లందరు కూడా ఆ బ్యాంకులో వెల్త్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ యూనిట్‌కు చెందిన ఉద్యోగులు కావడం గమనార్హం.

Also Read:  రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం..

బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపిన ప్రకారం.. వెల్స్ ఫార్గో బ్యాంకులో (Wells Fargo Bank) పనిచేస్తున్న ఉద్యోగులపై ఆ కంపెనీ నిఘా పెట్టింది. వారు.. పనిచేస్తున్నట్లు కనిపించేలా సిమ్యూలేట్ కీబోర్డు యాక్టివిటీకి పాల్పడుతున్నట్లు గుర్తించింది. పనిచేయకున్నా కూడా చేసినట్లు నటించిన ఇలాంటి ఉద్యోగుల్ని ఆ బ్యాంకు గత నెలలో తొలగించింది. సిమ్యూలేట్ కీబోర్డు యాక్టివిటీ (Simulate Keyboard Activity) అంటే సిస్టమ్‌ వర్క్ చేయకున్నా కూడా దానంతట అదే మౌస్ కదులుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆ ఉద్యోగి పనిచేస్తున్నారని ఆయా కంపెనీలు భావిస్తాయి. కానీ చివరికి వెల్స్‌ ఫార్గో బ్యాంకు తమ ఉద్యోగులు రహస్య గుట్టు తెలుసున్న అనంతరం వాళ్లని విధుల నుంచి తొలగించింది. ఇలా సిమ్యులేటెడ్ కీబోర్డు యాక్టివిటీతో వర్క్ చేయడం అనేది కరోనా మహమ్మారి మొదలైనప్పుడు చాలామంది వర్క్‌ ఫ్రం హోంకు పరిమితమైపోయారు. ఆ సమయంలోనే ఇలాంటి ఫేక్‌ వర్క్‌ విపరీతంగా పెరిగింది.

Advertisment
తాజా కథనాలు