Weight Loss Tips : బరువు తగ్గడం(Weight Loss) అంత ఈజీ కాదు. ఆహారాన్ని నియంత్రించడం కష్టమైన వారికి ఇది మరింత కష్టం. బరువు తగ్గడానికి ప్రధాన నియమం ఏమిటంటే, కేలరీల సంఖ్యను తగ్గించడం. దీంతో పాటు ప్రతిరోజూ శారీరక శ్రమ(Physical Activity) చేయడం. ఇక వీటితో పాటు వెయిట్ లాస్‌కు ఏం చేయాలో తెలుసుకోండి.
బ్రేక్‌ఫాస్ట్ మానవద్దు:
- బరువు తగ్గడానికి అల్పాహారం(Breakfast) దాటవేయాల్సిన అవసరం లేదు. అల్పాహారం రోజులో అతి ముఖ్యమైన ఫుడ్. టిఫిన్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తినండి. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఆ తర్వాత తరచుగా ఆకలిని అనిపించదు. అప్పుడు మీరు అతిగా తినకుండా ఉండవచ్చు. ఇది తెలియకుండానే మీ డైట్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. బరువును తగ్గిస్తుంది. గుడ్లు, మొలకలు, చీలా, చిక్పీస్ సలాడ్, పనీర్ పరాఠాలు అన్నీ ఆరోగ్యకరమైన టిఫిన్ కోసం మంచి ఎంపికలు.
పుష్కలంగా నీరు త్రాగాలి:
- ఉదయాన్ని రెండు గ్లాసుల నీటితో ప్రారంభించండి. గోరువెచ్చని నీరు(Hot Water) తాగడం వల్ల పొట్ట క్లియర్ అవ్వడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. నీరు త్రాగటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఇది బరువు తగ్గిస్తుంది.
బీ యాక్టివ్:
- శరీరాన్ని ఫిట్‌గా, చురుకుగా ఉంచడానికి సాధారణ నడక, జాగింగ్, జంపింగ్ రోప్ లేదా సైక్లింగ్(Cycling) కూడా మంచి మార్గాలు. అవి కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి. జీవక్రియను సరిగ్గా ఉంచుతాయి. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. ఉదయం కాసేపు వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఆకలి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.