Rain Alert: మరో మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
తెలంగాణను వర్షాలు ముంచెత్తేస్తున్నాయి. నిన్న, ఈ రోజు కాస్త తెరిపిచ్చిందంటే మళ్ళీ మరో మూడు రోజులు తెలంగాణ అంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణను వర్షాలు ముంచెత్తేస్తున్నాయి. నిన్న, ఈ రోజు కాస్త తెరిపిచ్చిందంటే మళ్ళీ మరో మూడు రోజులు తెలంగాణ అంతటా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశ్యాన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి..ఉపరితల ఆవర్తనం ఏర్పాడింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నాడు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం కారణంగా మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన వాతావరణశాఖ ఇచ్చింది. మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొద్దిగా గాలుల వేగంతో పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు అధికారులు. ఈనెల 20న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. సోలన్‌లోని జాడోన్ గ్రామంలో క్లౌడ్ బస్ట్ తో ఐదుగురు మరణించారు. ముగ్గురు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ధరంపూర్‌లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు జలసమాధి అయినట్లు సమాచారం.