Scrolling మున్నేరు వాగు వరద ఉధృతి.. ఖమ్మంలో మూడో ప్రమాద హెచ్చరిక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41.2 అడుగులకు చేరింది.అటు పాలేరు రిజర్వాయర్‌తో పాటు మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గ్రామాన్ని ముంచేసిన వరద..బిల్డింగులు, చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్న ప్రజలు! ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. ఆ వరదలోనే గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. మొరంచపల్లి గ్రామాన్ని వరద మొంచెత్తుతోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే వరద ప్రవాహం పెరుగుతూనే పోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దీంతో తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. By P. Sonika Chandra 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కరుణించని వానదేవుడు..ఆగని వానలతో ప్రజల ఆగమాగం జిల్లాలో వానలు ఆగడం లేదు. ఇప్పటికే వరదలతో చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. కొన్ని చెరువులు మరమ్మతులకు నోచుకోక కట్టలు బలహీనంగా ఉన్నాయి. వరద ఉధృతికి పైడిపల్లి చెరువు కట్ట తెగిపోయింది. వాగు ఉధృతికి ఇండ్లపైకి ఎక్కిన నార్లాపూర్ గ్రామస్తులు ప్రాణాలు కపాడుకుంటున్నారు. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలంలో టెన్షన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం (Bhadrachalam)వద్ద గోదావరి (Godavari) నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో దంచికొడుతున్న వాన..పొంగిపొర్లుతున్న వాగులు..!! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి వరద ఉధృతిలో Rtv బృందం సాహసం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలోని గొల్లప్రోలు గ్రామంలో Rtv టీమ్ సాహసం చేసింది. భారీగా వస్తున్న వరదను సైతం లెక్క చేయకుండా నది ప్రవాహంలోకి దిగి రైతుల, గ్రామస్తుల కష్టాలను తెలుసుకుంది. తమకు ప్రభుత్వం సహకారం అందించాలని రైతులు Rtv ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Karthik 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పోటెత్తిన గోదావరి..రాములోరి గుడి చుట్టూ నీళ్లు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ! ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By P. Sonika Chandra 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో దంచికొడుతున్న వానలు..జిల్లాలో టెన్షన్..టెన్షన్ కొద్ది రోజులగా తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా జిల్లాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శబరి నదికి వరద బీభత్సం..38 గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. రెండు రోజులు నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ప్రభావంతో మళ్లీ వరదలు వస్తాయోమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn