Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.