Rain Alert : తెలంగాణ (Telangana) లో 4 నుంచి 11 జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలోనే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయువ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్!
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
Translate this News: