Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన.. సెప్టెంబర్ లో భారీ వర్షాలు!!
ఆంధ్ర ప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వానలు పడాల్సింది పోయి.. ఎండలు మండిపోతున్నాయి. నిజానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్, జులై, ఆగష్టు నెలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అరేబియా సముద్రం, బంగాళా ఖాతంలో రుతు పవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి వర్షాలు కురవాలని. కానీ ఈ ఏడాది పెద్దగా వర్షాలు కురవలేదు. ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా ఆంధ్ర ప్రదేశ్ లో రుతుపవనాల ప్రభావం లేదని అంటున్నారు.