Tamilnadu: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాము- స్టాలిన్ కేంద్రం బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం చేసిందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని హెచ్చరించారు. By Manogna alamuru 25 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Stalin: పార్లమెంట్ సమావేశాల్లో తమిళనాడుపై కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ డీఎంకే ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శించారు. డీఎంకే నిరసనపై సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మనం దేశం గురించి ఆలోచించాలి. 2024 బడ్జెట్ మీ పాలనను కాపాడుతుంది.. కానీ దేశాన్ని రక్షించదు. ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా నడపండి.. లేకపోతే మీరు ఒంటరవుతారు’ అని పోస్టులో పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ఓడించిన వారి పట్ల ఇంకా ప్రతీకారం తీర్చుకోవద్దు.. మీ రాజకీయ ఇష్టాలు, అయిష్టాల ప్రకారం మీరు పాలించినట్లయితే మీరు ఒంటరిగా మిగిలిపోతారు’ అని హెచ్చరించారు. ఇండియా కూటమిలోని తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై సీఎం చిన్నచూపు చూస్తోందని సీఎం స్టాలిన్ అన్నారు. బడ్జెట్‌లో చెన్నై మెట్రో రైలు రెండవ దశ, కోయంబత్తూరులో అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రం నిధుల్ని కేటాయిస్తుందని ఆశించామని వెల్లడించారు. దీంతో పాటు చెన్నై,దక్షిణాది జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల పునరుద్ధరణ కోసం కేంద్రాన్ని రూ.37,000 కోట్లు నిధులు కేటాయించాలని అడిగితే ఇప్పటి వరకు రూ.276 కోట్లు మాత్రమే అందించిందన్నారు. బడ్జెట్‌లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జూలై 27న ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. Also Read:Paris Olympics: ఒలింపిక్స్ చిహ్నం వెనుక రంగుల కథేంటో తెలుసా.. #cm-stalin #tamilnadu #budget #neeti-aayog మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి