Cabinet Meeting : ఎన్నికల సంఘం (Election Commission) అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ (Telangana) కేబినెట్ సమావేశం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సోమవారం వరకు ఈసీ పర్మిషన్ ఇవ్వకపోతే.. మంత్రులతో కలసి ఢిల్లీకి వెళ్తామని అన్నారు. సీఈసీని కలిసి కేబినెట్ భేటీ కోసం అనుమతి తీసుకుంటామని చెప్పారు. అయితే శనివారం సాయంత్రం 4 గంటలకు కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ సర్కార్ ఈసీని కోరింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ (Election Code) అమల్లో ఉన్నందువల్ల సమావేశానికి పర్మిషన్ ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది.
Also Read: రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు: డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
దీంతో ఈసీ కేబినేట్ సమావేశానికి అనుమంతించకపోవడం వల్ల కీలక అంశాలు చర్చించలేకపోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలోనే కేబినేట్ భేటీ అనుమతి కోసం.. మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లీ సీఈసీ కలుస్తామని పేర్కొన్నారు.
Also Read: ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే