Telangana: ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క

తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈమేరకు శనివారం మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్‌ సెంటర్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

Telanagna: పదేళ్ళల్లో పరిష్కారం కాని అంశాలపై చర్చించాం- భట్టి విక్రమార్క
New Update

తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈమేరకు శనివారం మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. పోటీ పరీక్షల కోచింగ్‌కు నిపుణులైన వారితో ఫ్రీగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామని భట్టి తెలిపారు. మరో నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్‌ సెంటర్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొచ్చాక.. వేలాది మంది బీటెక్ చేసిన యువత స్కిల్స్‌ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని చెప్పారు.

Also Read: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మిషన్ భగీరత పథకం పనితీరుపై ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశాన్ని కూడా గ్రామసభల్లో ఒక ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Also read: సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. భార్య సహాయంతో దారుణం!

#unemployment #ambedkar #telugu-news #batti-vikramarka #ambedkar-knowledge-center
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe