Unemployment: అయ్యో.. ఉన్నవి పది ఉద్యోగాలు.. వందలాది మంది పోటీ.. తొక్కిసలాట!
గుజరాత్‌లోని భరూచ్‌లో కేవలం 10 ఖాళీల కోసం కెమికల్ సంస్థ థర్మాక్స్ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీనికి వందలాది మంది యువకులు హాజరుకావడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.