Minister Ponnam Prabhakar: ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి.. వాటిని పరిష్కరించడంలో మీడియాది ప్రముఖ పాత్ర ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల మీద త్వరలో హెచ్.యూ.జేలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. బషీర్ బాగ్‌లోని జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు.
అర్హులై జర్నలిస్టులకు త్వరలోనే న్యాయం జరుగుతుందని చెప్పారు మంత్రి పొన్నం. సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ మెమోరియల్ అవార్డ్ స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డికి ప్రధానం చేశారు. మీడియా అకాడమీ ఛైర్మెన్ కె శ్రీనివాస్ రెడ్డి , టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన కె.విరాహత్ అలీలతో పాటు, కార్యదర్శి వి.యాదగిరి, కోశాధికారి వెంకట్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొమ్మగాని కిరణ్ కుమార్, టియుడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, అనిల్, గౌస్ మోహినుద్దీన్ తదితరులను మంత్రి పొన్నం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..