BRS Chief KCR: మళ్లీ మేమే అధికారంలోకి వస్తాము.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉందని అన్నారు.

KCR: నా బిడ్డ జైలులో ఉంటే బాధగా ఉండదా.. అగ్నిపర్వతంలా ఉన్నా: కేసీఆర్
New Update

BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అన్నీ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈరోజు కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే అని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపోటములు సహజం అని.. గెలిస్తేనే లెక్క అనుకోవద్దని అన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని అన్నారు.

ALSO READ: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం.. కొడాలి నాని హాట్ కామెంట్స్

మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం..

ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు కేసీఆర్. తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చే విధంగా కష్టపడ్డానని అన్నారు. తమ పార్టీ హయాంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చామని.. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నుంచి అనేక పరిశ్రమలు వెళ్లిపోవాలని యోచిస్తున్నాయి.

తెలంగాణలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే ఒక కంపెనీ తమిళనాడుకు వెళ్లి పోయిందని అన్నారు. అల్యూమినియం, ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కరెంట్ కోతల వల్ల ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని బాధ కలుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని విమర్శించారు.

#brs #2024-lok-sabha-elections #brs-chief-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe