రాజయ్య టికెట్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంపై జానకిపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పందించారు. తమకు జరిగిన అన్యాయం వల్ల తాము బయటకు వచ్చామన్నారు. తమ వల్ల రాజయ్యకు టికెట్ రాలేదని తాము అనుకోవడం లేదన్నారు. By Karthik 22 Aug 2023 in రాజకీయాలు వరంగల్ New Update షేర్ చేయండి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంపై జానకిపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పందించారు. తాము ఒకరి పొట్టెకొట్టే వాళ్లం కాదన్నారు. రాజయ్యకు మా వల్లే సీటు రాలేదని తాము అనుకోవడం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానానికి ఎవరికి సీటు ఇవ్వాలో తెలుసన్న ఆయన.. పార్టీ కోసం కష్టపడేవారికి ఇచ్చారన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఏం జరుగుతుందో సీఎం కేసీఆర్ గమనిస్తున్నారని, ఎవరినికి ఎలా బుద్ది చెప్పాలా అలానే చెప్పారని విమర్శించారు. రాజయ్య వల్ల తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికే తాము బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఆడవాళ్లుకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించానన్న ప్రవీణ్.. ఇకపై కూడా ఎవరైనా ఆడవాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాను ప్రశ్నిస్తునే ఉంటానన్నారు. మరోవైపు రాజయ్యకు సీటు దక్కకపోడం బాధ కల్గించిందన్నారు. తాము కడియం శ్రీహరి వద్ద కూడా పని చేస్తామని జానకీపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మారుతారని తాను అనుకోడం లేదని, ఆయన బీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే రాజయ్యకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రవీణ్ తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలకు పోకుండా, వర్గపోరుకు పోకుండా అందరితో కలిసి పనిచేస్తే సీఎం కేసీఆర్ పిలిచి మరీ పదవి అప్పగిస్తారని జానకిపురం సర్పంచ్ నవ్య ఆమె భర్త ప్రవీణ్ వెల్లడించారు. తమ వల్లే రాజయ్యకు సీటు రాలేదని ప్రచారం చేయవద్దని ఆయన కోరారు. #brs #kcr #praveen #ticket #station-ghanpur #rajaiah #janakipuram-sarpanch #navya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి