/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohith-3-jpg.webp)
ఫ్లడ్ లైట్ల కింద పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు డ్యూ వల్ల బంతి ఫుల్ ప్వింగ్ అవుతంది. అది ఆస్ట్రేలియా వాళ్ళకు ప్లస్ అయింది. అయితే వీటిని మేము ఓడిపోవడానికి సాకుగా చూపించాలని అనుకోవడం లేదని ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్య అన్నాడు. మ్యాచ్ తరువాత మాట్లాడుతూ తాము ఇంకో 20-30 పరుగులు అదనంగా చేసి ఉంటే పలితం మరోలా ఉండేదని చెప్పాడు. సరైన టైమ్ లో మా బ్యాటింగ్ వైఫల్యం చెందింది. ఈ రోజు ఫలితం మాకు అనుకూలంగా3 లేదని వ్యాఖ్యానించాడు. ఫైనల్ మ్యాచ్ కు తగ్గట్లు ఆడేలకపోయామని ఒప్పుకున్నాడు కెప్టెన్.
తరువాత బౌలింగ్ కు వచ్చినప్పుడు కూడా 240 పరుగులు టార్గెట్ అంటే వికెట్లు త్వరగా తీయాలని అనుకున్నాం. అలాగే మొదటి మూడు వికెట్లు చాలా తొందరగానే తీశాము కానీ...ఆ తరువాత అస్సలు వికెట్స్ తీయలేకపోయాము. మూడు వికెట్ల తర్వాత హెడ్, లబుషేన్లు పెద్ద భాగస్వామ్యం నమోదు చేవారు. ఇద్దరికీ ఆ ఘనత దక్కుతుంది. అయితే వీటిని వేటినీ మేము సాకుగా చూపించాలని అనుకోవడం లేదు. తాము అన్ని విధాలుగా వైఫల్యం చెందామని అంటున్నాడు రోహిత్ శర్మ. ముందు పరుగులూ తీయలేదు. తరువాత వికెట్లనూ తీయలేకపోయాము అంటూ బాధగా చెప్పుకొచ్చాడు.
Nothing is more painful than watching tears in 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮's eyes again after 2️⃣0️⃣1️⃣9️⃣ CWC!💔😢#RohitSharma#CWC2023Final#indpic.twitter.com/6UsAF80gkM
— Cricdiction (@cricdiction) November 19, 2023
Follow Us