IPL 2024: 'మాకు నమ్మకం లేదు దొర..మీ కన్నా అమ్మాయిలు వంద రెట్లు నయం!'

IPL 2024 సీజన్ లోనైనా ఆర్సీబీ ఆ రాతను మారుస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఈ సీజన్ లో కూడా చెత్తాటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో దాదాపు ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగిన ఆర్సీబీ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

IPL 2024: 'మాకు నమ్మకం లేదు దొర..మీ కన్నా అమ్మాయిలు వంద రెట్లు నయం!'
New Update

Royal Challengers Bangalore: ఐపీఎల్ లో అందరి జట్లు ఒకటైతే.. రాయల్ ఛాలెంజర్స్ టీమ్ బెంగళూరు రూటు మాత్రం సపరేటు.. జట్టులో టాలెంటెడ్ ప్లేయర్లకు కొదవ లేకున్నా.. ప్రతీ సారి ట్రోఫి గెలుస్తుందని అంచనా వేసే జట్లలో ముందు వరుసలో ఉన్నా.. ఆ జట్టు తలరాత మాత్రం మారదన్న విమర్శలున్నాయి. కోహ్లీ (Virat Kohli) , గేల్, ఏబీడీ జట్టులో ఉన్నప్పుడు కూడా ఆర్సీబీ ట్రోఫిని ముద్దాడలేకపోయిందంటే ఆ జట్టు ఫేట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ప్రతీసారి కప్ కొడుతుందని బెంగళూరు అభిమానులు ఆశలు పెట్టుకోవడం.. ఆర్సీబీ టీమ్ నిరాశపరచడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఈ సారి సీజన్ లోనైనా ఆ రాతను మారుస్తుందని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ.. ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా చెత్తాటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒక దాంట్లో మాత్రమే నెగ్గింది. మిగతా ఆరు మ్యాచుల్లో చేతులేత్తేసింది.ఈ ఓటములతో దాదాపు ప్లే ఆఫ్ రేసుకు దూరమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు అసాధ్యం. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములకు బ్రేక్ పడటం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఆర్‌సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాలుగో విజయం కాగా.. ఆర్‌సీబీకి ఆరో ఓటమి.

Also Read: వాట్సాప్‌ లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..!

కోహ్లీ, డుప్లెసిస్, దినేష్ కార్తీక్, మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, సిరాజ్, రీస్ టోప్లే వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఆ జట్టు పరిస్థితి అయోమయంగా ఉంది. ఒక్కరి ఇద్దరి ప్రదర్శన తప్ప.. జట్టుగా ఆడటంలో విఫలమవుతుంది ఆర్సీబీ. బ్యాటింగ్‌లో కోహ్లీ, దినేష్ కార్తీక్ మాత్రమే కంటిన్యూస్‌గా అదరగొడుతున్నారు.అయితే.. జట్టు విజయానికి ఆ ఇద్దరు మెరుపులు సరిపోవడం లేదు. బ్యాటింగ్ ఓకే.. బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సిరాజ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మిగతా బౌలర్లు గురించి చెప్పక్కర్లేదు. యష్ దయాల్, రీస్ టోప్లే, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్, లోమ్రర్ ఇలా ప్రతి ఒక్క బౌలర్ కూడా పోటీ పడి మరీ పరుగులు సమర్పించుకుంటున్నారు.

దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఆర్సీబీపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీజన్లు మారినా.. ఆటగాళ్లు మారినా మీరు మాత్రం కప్ కొట్టడం అసాధ్యం అంటూ ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిల్ని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.మహిళా ఐపీఎల్‌లో అమ్మాయిలు కప్ నెగ్గారు. కానీ.. అబ్బాయిలు మాత్రం ఘోరంగా ఓడిపోతున్నారు. దీంతో.. ఫ్యాన్స్ మీ కన్నా అమ్మాయిలు వెయ్యి రెట్లు నయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మాకు నమ్మకం లేదు దొర.. మీరు కప్ గెలిచే భాగ్యం ఈ జన్మకు దక్కేదేమో అంటూ నిరాశపడుతున్నారు.

#royal-challengers-bangalore #virat-kohli #rcb #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి