Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన నీటి సమస్య..

హైదరాబాద్‌లో నీటి సమస్యలు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో వాటర్‌ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. రోజుకు 6500 ట్యాంకర్లు బుక్‌ అవుతున్నాయి. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది.

New Update
Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన నీటి సమస్య..

ఇటీవల బెంగళూరులో మొదలైన నీటి సంకోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా నీటి కష్టాలు మొదలయ్యాయి. చాలా ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో రోజుకు 6500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. కొత్త నీటి వనరులు లేకపోవడం, అదనపు నీటి జలాల తరలింపులు లేక..అధికారులు నగరానికి ఐదు నీటి వనరుల నుంచి 559.91 ఎంజీడీలకు సరఫరా చేస్తున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, భూగర్భజలాలు ఎండిపోవడం, నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల తాగునీటికి చాలా డిమాండ్ ఉంది. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు కూడా సరిపోవడం లేదు.

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..నో బెయిల్

అందుకే చాలామంది ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, శేరిలింగంపల్లి అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో ట్యాంకర్లకు బాగా డిమాండ్ ఉంది. రోజుకు 4 ట్యాంకర్ల(500) చొప్పున నెలకు 120 కొనాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. అంతేకాదు ట్యాంకర్లకు డిమాండ్ పెరగడం వల్ల ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదిలాఉండగా.. ఇటీవల బెంగళూరులో కూడా నీటి సంక్షోభం ప్రారంభమైంది. అక్కడ కూడా నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ నగరంలో మొత్తం 14 వేల బోర్‌వేల్స్ ఉండగా.. దాదాపు 7 వేల బోర్‌వెల్స్ ఎండిపోయాయి. దీంతో నగర ప్రజలు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. అలాగే అక్కడ నీటిని చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. నీళ్లు వృథా చేసినందుకు 22 కుటుంబాలపై బెంగళూరు వాటర్‌ బోర్డు రూ.5వేలు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే.

Also Read: దారుణం.. యువకుడిని వెంటాడి మరీ చంపేశారు

Advertisment
తాజా కథనాలు