ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం.. దెబ్బతిన్న పంటలు, కాలువలు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం స్థానికులను కలవరపెడుతోంది. నేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం నుంచి నీరు లికేజీ అవుతోంది. దీంతో కాలువలు పంట భూములు దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. By B Aravind 02 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కూలీలను సహాయక సిబ్బంది దాదాపు 17 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఉత్తరకాశీ జిల్లాలో మరో సొరంగం అక్కడి స్థానికులను భయపెడుతోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు వస్తుంది. ఈ నీటి ప్రభావానికి కాలువలు, పంట భూములు దెబ్బతిన్నాయని అక్కడివారు వాపోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మనేరీ భళి-2 అనే ప్రాజెక్టులో 16 కిలోమీటర్ల వరకు పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసు అనే ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ధారసు సమీపంలో ఉన్న మహర్‌గావ్‌లోని సొరంగం నుంచి రెండేళ్ల క్రితం నీటి లికేజీ మొదలైంది. Also read: కేంద్ర బలగాల అధీనంలోకి నాగార్జునసాగర్.. ఈరోజు వివాదం కొలిక్కి వస్తుందా..? ఇది క్రమంగా అలా పెరుగుతూనే ఉంది. ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (యూజేవీఎన్‌ఎల్) ఇప్పటికే దీని మరమ్మతులు కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది. అయినా కూడా లికేజీ అదుపులోకి రాలేదు. గత రెండేళ్లుగా ఇక్కడి నుంచి నీటి లీకేజీ వేగంగా పెరుగుతోంది అక్కడి స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల సాగునీటి కాలువలు, పంట భూములు దెబ్బతిన్నాయని.. అలాగే కొన్ని ప్రాంతాల్లో భూమి కూడా కోతకు గురవుతోందని తెలిపారు. వెంటనే సొరంగానికి మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను కోరారు. అయితే మనేరి భళి సొరంగం లికేజీకి అడ్డుకట్ట వేసే మరమ్మతు పనులు చేస్తున్నామని.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని యూజేవీఎన్‌ఎల్ ఎండీ సందీప్ సింఘాల్ పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల కుప్పకూలిన సొరంగం నిర్మాణ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని యూజేవీఎన్‌ఎల్ వెల్లడించింది. Also Read: రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్.. ఆ తర్వాతే ఫలితాల ప్రకటన..!! #telugu-news #national-news #tunnel-collapse #uttarkashi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి