USA vs PAK: ఇలాగైతే కష్టమే.. పాక్ ఓటమిపై వసీమ్‌ అక్రమ్‌ చురకలు!

యూఎస్ఏ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రదర్శన సరిగా లేదు. టీమ్ ఆటతీరు యావరేజీ కంటే తక్కువే. ఇలా ఆడితే భారత్, ఐర్లాండ్‌, కెనడాలను ఓడించడం చాలా కష్టం అన్నాడు.

New Update
USA vs PAK: ఇలాగైతే కష్టమే.. పాక్ ఓటమిపై వసీమ్‌ అక్రమ్‌ చురకలు!

T20 World Cup 2024: టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా యూఎస్ఏ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్థాన్ టీమ్ పై పాక్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ అంసతృప్తి వ్యక్తం చేశాడు. గురువారం ఇరుజట్ల మద్య తొలి మ్యాచ్ జరగగా.. యూఎస్‌ఏ సంచలన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌కు వెళ్లిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన పసికూన ప్రధాన జట్లకు హెచ్చరికలు పంపించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన వసీమ్ అక్రమ్.. ‘గెలవడం, ఓడిపోవడం గేమ్‌లో కామన్‌. చివరి బంతి వరకూ పోరాడటం చాలా ముఖ్యం. కానీ నాకు పాక్ జట్టులో యూఎస్‌ఏతో మ్యాచ్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. సూపర్‌ 8కు వెళ్లాలంటే పాక్ చాలా శ్రమించాలి. ఇప్పటి నుంచి కష్టాలు మొదలైనట్లే. తదుపరి మ్యాచుల్లో భారత్ తో తలపడాల్సి ఉంటుంది. ఐర్లాండ్‌, కెనడాలతోనూ అంత తేలికేం కాదన్నారు.

యావరేజీ కంటే తక్కువే..
అలాగే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌, షాదాబ్‌ మధ్య భాగస్వామ్యం వల్లే గౌరవప్రదమైన స్కోర్ దక్కిందన్నారు. వారిద్దరూ తప్పా ఎవరూ రాణించలేదు. ఫీల్డింగ్‌లోనూ తేలిపోయారు. ఆటతీరు యావరేజీ కంటే తక్కువే. ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రదర్శనే సరిగా లేదు. యూఎస్‌ఏతో ఆడేటప్పుడు నాతోపాటు మా జట్టు అభినులంతా గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం. తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత కూడా అలాంటి భావనే ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌ వచ్చేనాటికి యూఎస్‌ఏ దూకుడు పెరిగింది. ఆ జట్టు కెప్టెన్‌ మోనాంక్ సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఫీల్డింగ్‌ కూడా బాగుంది. రాబోయే మ్యాచ్ ల్లో పాక్ తప్పకుండా మెరుగపడాలన్నారు.

Advertisment
తాజా కథనాలు