బుద్ధి ఉందా? ఇమ్రాన్‌ఖాన్‌కి జరిగింది ముమ్మాటికి అన్యాయమే!
పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పీసీబీ(PCB) రిలీజ్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్, యార్కర్ కింగ్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ క్రికెట్ గొప్పతనాన్ని చూపించే వీడియోలో ఇమ్రాన్‌ఖాన్ ఎందుకులేడో తనకు అర్థంకాలేదని ఫైర్ అయ్యాడు. పీసీబీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. 1992లో పాక్ జట్టుకు ప్రపంచ్ కప్ అందించింది ఇమ్రాన్ఖానేనన్న విషయం మరువద్దన్నాడు ఇమ్రాన్‌ఖాన్. ప్రస్తుతం 'తోషాఖాన' కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ని కావాలనే పీసీబీ వీడియోలో లేకుండా చేసిందని సమాచారం.