High BP: ప్రస్తుత కాలంలో ఎంతోమంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారం అలవాట్లే అంటున్నారు నిపుణులు. హై బీపీ సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది తీవ్రంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా దీని వలన గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి. హైబీపీని సకాలంలో నియంత్రించకపోతే కిడ్నీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు వలన దృష్టి, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఇలాంటి సమయంలో దీనిని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో అధిక బీపీని ఉన్నట్లు అనేక సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలు చాలా వరకు నిద్రపోతున్నప్పుడు కనిపిస్తాయి. ఇది హెచ్చరిక చిహ్నంగా చూడాలని వైద్యులు చెబుతున్నారు. ఆ హెచ్చరికలు ఏంటో ఉప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
బీపీ ఉంటే కానిపించే లక్షాలు ఇవే:
- శరీరంలో అధిక రక్తపోటు ఉంటే అనేక లక్షణాలు రాత్రి నిద్రిస్తున్నప్పుడు కనిపిస్తాయి. వీటిని పదే పదే నిర్లక్ష్యం చేస్తే శరీరానికి అనేక రకాల ప్రమాదాలతోపాటు గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- ప్రస్తుతం కాలంలో నిద్ర సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. నిద్రలేమి కూడా అటువంటి సమస్య, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒత్తిడి, ఆందోళన నిద్రను ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు సహజ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రాత్రంతా నిద్రపోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
- ఓఅధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువగా గురక పెట్టేవారికి అధిక BP ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని స్లీప్ అప్నియా అంటారు. ఇవి హై బీపీకి సంకేతాలు కావచ్చని నిపుణులు అంటున్నారు.
- రాత్రిపూట తరచుగా అధిక మూత్రవిసర్జన సమస్య ఉంటే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. ఇవి అధిక రక్తపు సంకేతాలు కావచ్చు. అధిక BPమూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన మూత్రం అధికంగా వస్తుందంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
- రాత్రిపూట, నిద్రలేచిన తర్వాత తలనొప్పి వస్తే అధిక రక్తపోటుకు సంకేతం. అధిక రక్తపోటు కారణంగా వచ్చే తలనొప్పి ఉదయం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి నిద్రపోయేటప్పుడు రక్తపోటు పెరుగుతుంది, ఉదయం చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి : ఉదయం వాకింగ్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆరోగ్యానికి సమస్యలు తప్పవు..?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.