Police Commissioner: ఏబీవీపీ నేతలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వరంగల్‌ పోలీస్‌ ఉన్నతాధికారి స్పందించారు. ఏబీవీపీ విద్యార్థి నేతలు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చారన్నారు. వర్సిటీలో డోర్లు పగలగొట్టారన్నారు

Police Commissioner: ఏబీవీపీ నేతలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు
New Update

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై వరంగల్‌ పోలీస్‌ ఉన్నతాధికారి స్పందించారు. ఏబీవీపీ విద్యార్థి నేతలు అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి వచ్చారన్నారు. వర్సిటీలో డోర్లు పగలగొట్టారన్నారు. పోలీసులు ఆపుతున్నా ఆగకుండా ఆఫీస్‌లో ఉండే ఫర్నీచర్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. విద్యార్థి నాయకులను కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో పోలీసులు తమపై దాడి చేసినట్లు ఏబీవీపీ నాయకులు చెప్పారని వరంగల్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

అనంతరం వారిని మెడికల్‌ చెకప్‌ల కోసం ఆస్పత్రికి తరలించామని, చెకప్‌ అనంతరం వచ్చిన రిపోర్ట్‌లో పోలీసులు కొట్టిన గాయాలు ఎక్కడా లేవన్నారు. వారు గతంలో ఎప్పుడో క్రికెట్‌ ఆడిన సమయంలో తగిలిన చిన్న చిన్న గాయాలను చూపిస్తూ పోలీసులు తమపై దాడి చేశారని, ఆ గాయాలు పోలీసులు కొట్టిన దెబ్బలే అని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందులో కొందరు ఏబీవీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యంలో అనేక రకాల అన్యాయాన్ని నిలదీయవచ్చని, కానీ భౌతిక దాడులు సమంజసం కాదని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. పోలీసులు 99.9 శాతం వరకు భౌతిక దాడులకు దిగరని స్పష్టం చేశారు.

ఒకవేళ పోలీసులు భౌతిక దాడులకు దిగితే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు. ఇలాంటి వారి వల్ల మంచి పిల్లలు కూడా చెడిపోతున్నారని పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. కాగా ఈ దాడిలో ప్రధాన నిందితులు A1 అంబటి కిరణ్‌, A2 ప్రశాంత్ అని పోలీసులు తెలిపారు. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్న ఆయన.. ఇందులో రాజకీయాలను చేర్చి అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అలాంటి వారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి అందరూ సమానులే అని పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

#warangal #abvp #kakatiya-university #furniture #police-commissioner
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe