USA: 8 లక్షల టిప్ వచ్చింది..కానీ ఉద్యోగం పోయింది ఎప్పుడూ ఊహించనంత టిప్ వచ్చింది. దాన్ని సెలబ్రేట్ చేసుకుందామనుకునే లోపే ఉద్యోగం పోయింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా వెయిట్రస్సే పోస్ట్ చేసింది. By Manogna alamuru 20 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Wiatress Got 10 Thusand Dollors As Tip: అమెరికాలో మిచిగన్ రాష్ట్రంలో బెంటన్ హార్బర్ అనే ఊరిలో ది మానస్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్ ఉంది. దీనికి ఒక వ్యక్తి కస్టమర్‌గా వచ్చారు. మామూలుగా ఏదో తినేసి వెళ్ళిపోకుండా తన చనిపోయిన స్నేహితుడు జ్ఞాపకంగా 10వేల డాలర్లు అక్కడ పని చేస్తున్న లిన్నే బోయడ్‌కు ఇచ్చి వెళ్ళాడు. ఆ మొత్తాన్ని రెస్టారెంట్‌లో పని చేస్తున్న అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పి మరీ వెళ్ళాడు. కస్టమర్ ఇచ్చిన టిప్‌ను లిన్నే మొదల నమ్మలేకపోయింది. నిజంగానే జరిగిందా అని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు కనిపిస్తుంటే ఉబ్బితబ్బిబ్బు అయింది. కస్టమర్ చెప్పినట్టుగానే ఆరోజు రెస్టారెంట్‌లో ఉ్న 9మందికి 1100 డాలర్ల చొప్పున సమానంగా పంచింది. ఇంత వరకూ బాగానే ఉంది. వారం తర్వాత పోయిన ఉద్యోగం.. అంతా బాగా జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు.కానీ వారం తర్వాత లిన్నేకు రెస్టారెంట్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆమెను పనిలోంచి తీసేస్తున్నట్టు చెప్పింది. దీంతో లిన్నే ఖంగుతింది. ఏం చేయాలో తెలియక తన గోడునంతా సోషల్ మీడియాలో వెళ్ళబోసుకుంది. కస్టమర్ చేసిన పని, యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి అంతా వివరంగా చెప్పింది. అయితే దీని మీద రెస్టారెంట్ యాజమాన్యం కూడా స్పందించింది. లిన్నేను తీయడానికి కారణం టిప్ కాదని...క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తీసేశామని వివరణ ఇచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం రెస్టారెంట్ యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. లిన్నే చేసిన తప్పు ఏముంది అంటూ ఆమెంట్లు చేస్తున్నారు. అసలు కారణ వేరే... అయితే రెస్టారెంట్ వాళ్ళు తనను ఉద్యోగంలో నుంచి తీసేయడానికి కారణం టిప్పే అంటోంది లిన్నే. కస్టమర్ చెప్పినట్టు ఆమె డబ్బు మొత్తాన్ని సమానంగానే పంచింది. అయితే ఆ రోజు ఒక వెయిట్రస్ డ్యూటీకి రాలేదు. దాంతో వారికి ఆ డబ్బులు వెళ్ళలేదు. కానీ విషయం తెలుసుకున్న ఆ వెయిట్రస్ తన వాటా తనకు రావాలని గొడవ చేశారని...అది కాస్తా యాజమాన్యం దాకా వెళ్ళి లిన్నే ఉద్యోగం ఊడిపోయేదాకా వెళ్ళిందని తెలుస్తోంది. అయితే దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఏమీ స్పందించడం లేదు. Also Read:Tamil Nadu:జయలలిత బంగారం ఇచ్చేస్తాం..ఆరు ట్రంకు పెట్టెలు పట్టుకురండి #usa #tip #michigan #waitress #dollors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి