movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

ప్రముఖ నటి మమీదా రెహమాన్ దాదాసాహెబ్ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఏరువాక సాగారో అన్న పాటతో ఫేమస్ అయిన వహీదా రహ్మాన్

New Update
movies:ఏరువాక సాగారో నటి వహీదా రహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం

అలనాటి అందాల తార వహీదా రహ్మాన్ ను దాదాసాహెబ్ జీవితకాల సాపల్య పురస్కారం వరించింది. సినీపరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు వహీదా సేవలను అందిస్తున్నారు. ఈ అవార్డును ఆమెకు ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించిన వహీదా రహ్మాన్ తెలుగు సినిమాలోనూ మెరిసారు. ఆకాలంలో తెలుగు వాళ్ళను ఒక ఊపు ఊపిన ఏరువాక సాగారో పాటలో ఆమె నటించారు. ఇక హిందీలో వహీదా నటించిన ప్యాసా, కాగజ్ కే పూల్, చౌదవీకా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, కామోషీ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

తెలుగుతోనే మొదలు...

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిలో వహీదా రహ్మాన్ ఒకరు. 1938 ఫిబ్రవరి3న తమిళనాడు చెంగల్పట్టులో జన్మించారు. ఎన్టీయార్ నిర్మించిన జయసింహలో కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని వహీదా రహ్మాన్ ను ఎంపిక చేశారు. కానీ అంతకన్నా ముందే రోజులు మారాయి సినిమాలో ఆమె ఏరువాక సాగారో పాటలో నటించారు. దాంతో వహీదాకు అదే మొదటి సినిమా అయింది. ఏరువాక పాట బాగా ఫేమస్ అయింది. ఇప్పటికీ తెలుగు ప్రజల నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది.

ఇక 1971లో రేష్మా ఔర్ షేరా సినిమాకు వహీదా రహ్మాన్ జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. ఓల్డ్ అయిపోయినా ఇంకా అంతే అందంగా ఉండేవారిలో వహీదా రహ్మాన్ ఒకరు. ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ తనలోని నటిని నిలబెట్టుకుంటున్నారు ఆమె.

Advertisment
Advertisment
తాజా కథనాలు