ప్రముఖ వ్యాపారవేత్త వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మరణించారు. మెదడులో రక్తస్రావం జరగడం వలన ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గత వారం పరాగ్ తన ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతో కిందపడిపోయారు. అలా పడినప్పుడు ఆయన తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ;పరాగ్ దేశాయ్ వయసు 49 సంవత్సరాలు. ఇదంతా కుక్కలు దాడి చేయడం వల్లనే జరిగిందని పరాగ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పరాగ్ దేశాయ్ మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
Also Read:డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. కంపెనీ ఈ-కామర్స్లోకి తీసుకెళ్ళడంలో పరాగ్ కీలక పాత్ర పోషించారు. పరాగ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. వాఘ్ బక్రీ గ్రూప్ 1892లో నరన్ దాస్ దేశాయ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ 2వేల కోట్లు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Also Read:రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున రాహుల్ అపాయిట్మెంట్?