Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేతలు ప్రచారాలు అంటూ ఊదరగొడుతుంటే...ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల లెక్కలను బటయపెడుతోంది. ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు.

Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు
New Update

Voters List In AP : ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షల ఒక వేయి 887 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2 కోట్ల 3 లక్షల 39 వేల 851, మహిళలు 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 3 వేల 421, సర్వీసు ఓటర్లు 68 వేల 185 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా 5.94 లక్షల మంది ఓటర్లు(Voters) చేరారు. పురుషుల కంటే 7.18 లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా కనిపించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20.56 లక్షల మంది ఓటర్లు, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

పెరిగిన పోలింగ్ కేంద్రాలు..

ఏపీ(Andhra Pradesh) లో మొత్తం పోలింగ్ కేంద్రాల(Polling Booth) సంఖ్య 46 వేల 389 ఉన్నాయి. ఈ ఏడాది 224 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. 29 వేల 897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా పెట్టారు అధికారులు. ఆ ప్రాంతాల్లో CRPF బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాలుగా మాచర్ల, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 20.2 లక్షల మంది ఓటర్లు, విశాఖలో 20.1 లక్షల మంది, నెల్లూరు 19.4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 16 వేల 448 మంది సర్వీసు ఓటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో అత్యల్పంగా 392 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.

బరిలో ఉన్న అభ్యర్థులు..

175 అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు. 25 ఎంపీ స్థానాలకు 454 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా నంద్యాల స్థానంలో 31 మంది, కడప లోక్‌సభ నుంచి 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Also Read:Telangana: తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..

#andhra-pradesh #elections #polling #voters
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe