Vizag Beach: విశాఖలో వెనక్కు వెళ్తున్న సముద్రం.. జపాన్ భూకంపమే కారణమా? నాలుగు రోజులుగా వైజాగ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి అక్కడి సముద్రం వెనక్కి వెళ్ళడమే. ఎప్పుడో 2004లో సునామీ వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిన సముద్రం ఇప్పుడు మళ్ళీ అలానే వెళ్తోంది. దీనికి కారణం జపాన్ భూకంపమా? లేక మళ్ళీ సునామీ వస్తుందా? అంటూ అక్కడి వారు భయపడుతున్నారు. By Manogna alamuru 06 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Sea Going Back:వైజాగ్‌లో సముద్రం 100 అడుగులు వెనక్కు వెళ్ళింది. సాధారణంగా పౌర్ణమి, అమావాస్యలు దగ్గరగా ఉంటే సముద్రంలో అటుపోట్లు ఉంటాయి. దీనివలన అందులో అలలు, ఉవ్వెత్తున ఎగిసిపడడం, ముందు రావడం జరుగుతాయి. కానీ ఇప్పుడు విశాఖలో సముద్రం విచిత్రంగా వెనక్కు జరుగుతోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట 2004లో సునామీ వచ్చినప్పుడు ఇలా వెనక్కు వెళ్ళింది. మిగతా అన్ని చోట్లా సముద్రం ఉప్పొంగి, ముందుకు వచ్చి నగరాలను ముంచేస్తే ఒక్క వైజాగ్‌లో మాత్రమే వెనక్కు వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు రోజులుగా ఇది కొనసాగుతోంది. దీంతో మళ్ళీ ఏమైనా ప్రళయం ముంచుకొస్తుందా అంటూ విశాఖవాసులు ఆందోళన చెందుతున్నారు. Also Read:వైసీపీకి బిగ్ షాక్..క్రికెటర్ అంబటి రాయుడు అవుట్ జపాన్ భూకంపమే కారణమా? సముద్రం వెనక్కు వెళ్ళడానికి ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెబుతున్నారు. దీంట్లో అతి ఎక్కువగా వినిపిస్తున్న కారణం మాత్రం జపాన్ భూకంపం. సునామీ వచ్చినప్పుడు దెబ్బ తిన్న దేశాల్లో జపాన్ కూడా ఉంది. ఇప్పుడు కూడా నాలుగు రోజుల క్రితం అక్కడ బారీ భూకంపం వచ్చి పరిస్థితి అల్లకల్లోలం అయిపోయింది. సముద్రంలో కూడా భూకంపం వచ్చింది. అది సునామీకి దారి తీస్తుందేమో అని భయపడ్డారు కానీ జరగలేదు. ఇప్పుడు వైజాగ్‌లో సముద్రం వెనక్కు వెళ్ళడానికి మాత్రం జపాన్ భూకంపమే కారణం అయుండొచ్చు అని టాక్ నడుస్తోంది. అయితే జపాన్‌లో భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని మెట్రాలజీ విభాగం మాజీ ప్రొఫెసర్ రమేష్ అభిప్రాయపడ్డారు. సముద్రంలోని అనేక రకాల మార్పులు దాని తీరాన్ని ప్రభావితం చేస్తాయని.. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రొఫెసర్ చెప్పారు. ఫేమస్ టూరిస్ట్ స్పాట్.. వైజాగ్ బీచ్ తెలుగు రాష్ట్రాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇండియాలోనే ఇదొక మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఏం జరిగినా వెంటనే చర్చనియాంశం అవుతోంది. ఇక్కడ ఏ కాలంలో అయినా పర్యాటకులు ఉంటూనే ఉంటారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా ఎక్కువగా ఉంటారు. వైజాగ్‌లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే శీతాకాలంలో వాతావరణం కాస్త బాగుంటుంది. ఇది దృష్టిలో పెట్టుకునే విశాఖ బీచ్‌ను చూడడానికి ఈ కాలంలో ఎక్కువ మంది వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితులు టూరిస్టులను బాగా నిరాశపరుస్తున్నాయి. సముద్రం వెనక్కు వెళ్ళడంతో సందర్శకులు అక్కడికి రావడానికి కాస్త భయపడుతున్నారు. #andhra-pradesh #vizag #beach #japan-earth-quake మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి