Vivek Ramaswamy: భారతీయ - అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి పదవి రేసు (US Presidential race) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశారు. తాజాగా జరిగిన తొలి అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ నకు మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికలు జరిగాయి.
Also Read: గొనెసంచిలో మృతదేహం కలకలం.. ఓఆర్‌ఆర్ పైనుంచి కిందపడేసిన దుండగులు
ఇందులో డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) 51 శాతం ఓటింగ్ సాధించి గెలుపొందారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ జరిగింది. కేవలం 7.7 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం మాత్రమే ఓటింగ్ వచ్చింది. తాము ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని.. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు తనకు మార్గం లేదని చెబుతూ వివేక్ ప్రకటన చేశారు. అయితే గత ఏడాది ఫిబ్రవరి అధ్యక్ష రేసులోకి వచ్చిన వివేక్ పేరు అంతగా ఎవరకీ తెలియదు.
Also Read: భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం..
వలసవాదం, అమెరికాకే మొదటి ప్రాధాన్య లాంటి అంశాలను తీసుకొచ్చి అప్పట్లో వివేక్ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముందు నుంచి కూడా ఆయన ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ ప్రైమరీ తొలిపోరు జరిగేవరకు కూడా ట్రంప్, వివేక్‌లు బాగానే ఉన్నారు. కానీ రెండ్రోజుల క్రితం వివేక్‌పై ట్రంప్ విమర్శలు చేశారు. చివరకు.. అయోవా కాకసస్ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోవడంతో చివరికి వివేక్ బరిలోనుంచి తప్పుకున్నారు.