KODI KATTI CASE:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్

విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.

KODI KATTI CASE:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్
New Update

విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్టులో ఏపీ సీఎం జగన్ కోడి కత్తి కేసు మీద విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న జనుపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. శ్రీనివాస్ తరుఫున సలీమ్ తన వాదనలను వినిపించారు. ఈ కేసులో సీఎం జగన్ ఇంటిలో ఉండి హాజరు అవుతాను అంటున్నారు.. అదే రీతిలో తన క్లైంట్ కూడా ఇంటి నుంచే హాజరు అవుతారని లాయర్ సలీమ్ కోర్టుకు తెలిపారు. ఈ కేస్ లో ఎన్ ఐ ఏ వైసిపి కార్యకర్త లా వ్యవహరిస్తోందని..ఐదేళ్ల నుంచి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారరని అన్నారు.

ఈ కేస్ విచారణ విశాఖ ట్రయిల్ కోర్ట్ లో కాదు, హై కోర్ట్ లోనే జరగాలని నిందితుడి తరుఫు న్యాయవాది సలీమ్ కోర్టును కోరారు. నవంబర్ 17 లోపు హై కోర్ట్ లో పిటేషన్ వేస్తానని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ది కోసం విశాఖ లో ఈ కేస్ విచారణ చేశారు.ఇక హై కోర్ట్ లోనే విచారణ జరగాలని సలీమ్ వాదించారు. విశాఖ కోర్ట్ కు తీసుకొచ్చిన సమయంలో కూడా జనుపల్లి శ్రీనివాస ని ఎస్కార్ట్ గా ఉన్న పోలీసులు తనతో కూడా మాట్లాడనివ్వలేదని సలీమ్ అన్నారు.

ఇక విచారణ సమయంలో కోడి కత్తి శ్రీనివాస్ న్యాయమూర్తి ని ప్రత్యేకంగా వేడుకున్నారు. పోలీసులు తనను ఎవ్వరితోనూ మాట్లాడనివ్వడం లేదని చెప్పాడు. తన న్యాయవాదితో కూడా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు ఐదేళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ఈకేసు మీద హై కోర్ట్ లోనే నా పోరాటం చేస్తానని అన్నాడు. వాదనల అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.

Also Read:అంగళ్ళు కేసులో చంద్రబాబునాయుడు బిగ్ రిలీఫ్

#nia #jagan #casr #viskha #ap-cm #court #kodi-katti #vizag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe