Vande Bharat: విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ షెడ్యూల్ మార్పు విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ రైలు ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ నడుస్తోంది. ఇప్పుడు ఈ సెలవును మంగళవారానికి మార్చారు. By Manogna alamuru 09 Aug 2024 in వైజాగ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Visakhapatnam - Secunderabad : తెలుగు ప్రయాణికులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్ళే వందే భారత్ ట్రైన్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ ప్రతీ రోజూ నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళే ట్రైన్...విశాఖ నుంచి తెల్లవారు ఝామున 5.30 గంటలకు అక్కడి నుంచి వస్తుంది. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులూ ఈ వందే భారత్‌ను నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు దీని షెడ్యూల్‌ను మార్చారు. ఆదివారం ఉన్న సెలవును మంగళవారానికి ఛేంజ్ చేశారు. ఇక మీదట ఆదివారాలు కూడ విశాఖ–సికింద్రాబాద్ వందే భారత్ నడుస్తుంది. అయితే మంగళవారం మాత్రం దీనికి సెలవు అని ప్రకటించింది రైల్వేశాఖ. ఆదివారాలు ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా ఉండడంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా టైమింగ్స్ అవన్నీ యథాతధంగానే ఉన్నాయి. మరొక మఖ్యమైన విషయం ఏంటంటే...తాజాగా చోట చేసుకున్న మార్పు డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ఆదివారమే వందే భారత్‌కు సెలవు. Change in Days of Service of Visakhapatnam - Secunderabad - Visakhapatnam Vande Bharat express @drmsecunderabad pic.twitter.com/kNudtIeEc1 — South Central Railway (@SCRailwayIndia) August 9, 2024 Also Read: Vinesh Phogat: వినేశ్‌కు రజతం ఇవ్వాలి– సచిన్ మద్దతు #schedule #secunderabad #vande-bharat #visakhapatnam #train మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి