Pak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. By Karthik 25 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు. దీంతో మంగళవారం ఇండియాకు రావాల్సిన ఆ టీమ్ దుబాయ్‌లోనే ఉండిపోయింది. కాగా షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 26 పాకిస్థాన్ టీమ్ భారత్ చేరుకోవాలి, 29న పాక్ టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ టీమ్ కివీస్ టీమ్‌తో కలిసి హైదరాబాద్ వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా పాక్ టీమ్ 35 మందికి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పీసీబీ తెలిపింది. కానీ తమ టీమ్‌కు భారత ప్రభుత్వం ఇంతవరకు వీసాలు మంజూరు చేయలేదని పీసీబీ మండి పడింది. దీంతో పాక్-కివీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ సందిగ్ధంగా మారింది. పాక్ ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో పీసీబీ బీసీసీఐకి లేఖ రాసింది. వీసాలు రాకపోవడంపై లేఖలో తమ అభ్యంతరాలను తెలిపినట్లు తెలుస్తోంది. తమ ఆటగాళ్ల వీసాల కోసం తాము వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా.. భారత హోం శాఖ మాత్రం ఎన్ఓసీ ఇవ్వలేదని తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. వీసాల ఇబ్బంది రావడంతో దుబాయ్ నుంచి మళ్లీ పాక్ చేరుకున్న దయాది ఆటగాళ్లు మరో 24 గంటల్లో వీసా వస్తే ఇస్లామాబాద్ నుంచి దుబాయ్ మీదుగా నేరుగా హైదరాబాద్ వచ్చే విధంగా పాక్ క్రికెట్ బోర్డు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రపంచకప్‌కు ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్ క్యాన్సెన్ అయితే ఆ ప్రభావం వరల్డ్ కప్ మ్యాచ్‌లో పడే అవకాశం ఉందని పీసీబీ పేర్కొంది. #cricketers #pakistan #letter #bcci #visa #pcb #difficulties మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి