World Cup 2023: విరాట్ కాసేపు టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు-కే ఎల్ రాహుల్

వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో విజయం సాధించింది. మొదట్లో కొంచెం భయపెట్టినా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలో విజృంభించి ఆడడంతో శుభారంభాన్ని దక్కించుకున్నారు. ఇందులో కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అయితే విరాట్ వల్లనే తాను అలా బ్యాటింగ్ చేసానని అంటున్నాడు రాహుల్.

World Cup 2023: విరాట్ కాసేపు టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు-కే ఎల్ రాహుల్
New Update

KL Rahul - Virat Said Play Like Test Cricket: సెంచరీ చేయలేకపోయినందుకు తనకేమీ బాధగా లేదని అంటున్నాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ (Man Of The Match) కేఎల్ రాహుల్. టీమ్ ఇండియా గెలుపులో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని చెబుతున్నాడు. 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగాను. అసలు మైండ్ లో ఏ ఆలోచనా లేదు వచ్చినప్పుడు. అయితే క్రీజ్ లోకి రాగానే అప్పటికే అక్కడ ఉన్న విరాట్ (Virat Kohli) ఒక మాట చెప్పాడు. పిచ్ చాలా డిఫికల్ట్‌గా ఉంది...కాబట్టి కాసేపు టెస్ట్ క్రికెట్‌లా ఆడు అని చెప్పాడు. అంతే అంతకంటే ఎక్కువ ఇద్దరం ఏమీ చర్చించుకోలేదు. అయితే విరాట్ ఇచ్చిన ఆ సలహా మాత్రం చాలా బాగా పని చేసింది. పిచ్ కొత్త బంతికి, పేసర్లకు బాగా అనుకూలించింది. తరువాత స్పిన్నర్లకు కూడా. కానీ చివరి ఓవర్ల టైమ్ కు మంచు పడడం బ్యాటర్లకు కలిసివచ్చింది. బంతి స్కిడ్ అవడం వలన రన్స్ వచ్చాయి. మొత్తానికి చెన్నై పిచ్‌కు రెండు షేడ్స్ ఉన్నాయి. బౌలర్లకు, బ్యాటర్లకు కూడా సహరికరించింది. సౌత్ ఇండియాలో మాత్రమే ఇలాంటి పిచ్‌లు ఉంటాయని చెప్పుకొచ్చాడు రాహుల్.

మొదట ఆసీస్‌ (Australia) ను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంతో ఈజీగానే గెలిచేస్తాం...నేను హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు అనుకున్నాను. స్టాండ్స్ లో కూర్చుని కాసేపు మ్యాచ్ చూడొచ్చని కూడా ఊహించాను. కానీ రెండు రన్స్ కే మూడు వికెట్లు పడిపోవడంతో మొత్తం తారుమారు అయిపోయింది. అయితే అదేమీ నన్ను కంగారుపెట్టలేదని చెప్పాడు రాహుల్ (KL Rahul). ఇంక మూడు రన్స్ కొడితే సెంచరీ వస్తుంది. నిజమే కానీ అలా చేయలేకపోయినందుకు నాకేమీ పెద్దగా బాధ కలగలేదని అన్నాడు. జట్టు విజయంలో కీకలపాత్ర పోషించడమే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

200 టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా రెండు పరుగులకే కీలకమైన టాప్ ఆర్డర్ ను కోల్పోయింది. ఆ టైమ్ లో వచ్చిన కేఎల్ రాహుల్ 115 బంతుల్లో 97 నాటౌట్, విరాట్ 116 బంతుల్లో 85 పరుగులు చేసి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయాన్ని సాధించింది.

Also Read:బెయిలా… జైలా?6 కేసులు, 5 తీర్పులు.

#world-cup #virat-kohli #kl-rahul #india-vs-australia-world-cup #virat-said-play-like-test-cricket
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe