![World Cup 2023: దటీజ్ విరాట్...నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/virat-2-jpg.webp)
World Cup 2023: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ (Naveen-ul-Haq) మధ్య ఐపీఎల్ లో పెద్ద యుద్ధమే జరిగింది. చిన్న కారణం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో విరాట్ ఎంత తగ్గినా...నవీన్ ఉల్ మక్ మాత్రం తన టెంపరితనాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాడు. దాన్ని గుర్తు పెట్టుకున్న కోహ్లీ ఫ్యాన్స్ నిన్నటి మ్యాచ్ లో నవీన్ ను బాగా ఏడిపించారు. ఇది గమనించిన కోహ్లీ దయచేసి ట్రోల్ చేయొద్దు అంటూ ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశాడు. వద్దు, కామ్‌గా ఉండండి అంటూ చేతితో సైగలు చేస్తూ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వరల్డ్‌కప్‌లో నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం కూడా సాధించింది. అయితే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్ వేసినప్పుడు, ఫీల్డింగ్‌లో నిల్చున్నప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ అతనికి చుక్కలు చూపించారు. అసలే నిన్న మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. అది విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్. దీంతో అతని ఫ్యాన్స్ కోహ్లీ...కోహ్లీ అంటూ విరాట్ సామస్మరణతో స్టేడియాన్ని దద్దరిల్లించారు. ఇది గమనించిన విరాట్ సైలంట్‌గా ఉండండి అంటూ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశాడు.
విరాట్ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. కోహ్లీకి ఎంతకోపమెక్కువో అంత సంయమనం కూడా ఉంది. 2019లో స్టీవ్ స్మిత్‌ను (Steve Smith) ఛీటర్, ఛీటర్ అంటూ అభిమానలు వెటకారం చేసినప్పుడు కూడా విరాట్ అలా అనొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని నిరూపించాడు. అంతేకాదు నిన్నటి మ్యాచ్ లో తమ మధ్య ఉన్న గొడవకు విరాట్, నవీన్ ఉల్ హక్ ఇద్దరూ ఎండ్ కార్డు వేశారు. నవీన్ బౌలింగ్‌లో విరాట్ మొదటి బంతిని ఫోర్ కొట్టాడు. అప్పుడు రెండో బంతి వేసే ముందు నవీన్...కోహ్లీ దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడి హగ్ చేసుకున్నాడు. విరాట్ కూడా నవ్వుతూ అతన్ని హగ్ చేసుకున్నాడు. దీంతో ఇద్దరి గొడవకు శుభం పలికినట్టు అయింది.
Virat Kohli asking the Delhi crowd to stop mocking Naveen Ul Haq.pic.twitter.com/Dq482rPsFU
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023
Also Read:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్