/rtv/media/media_files/2025/07/01/youtuber-kanika-about-indian-railway-2025-07-01-12-15-52.jpg)
youtuber kanika about indian railway
Indian Railway: యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ కనికా దేవ్రానీ ఇండియన్ రైల్వే అంత సేఫ్ కాదు అంటూ ఆరోపణలు చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ట్రైన్ లో తాను దోపిడీకి గురైనట్లు తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి తన మొహంపై మత్తు మందు చల్లి దోపిడీకి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు తోటి ప్రయాణికులు కూడా దోపికి గురయ్యారని వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి కనికా తన ఇన్ స్టాగ్రామ్ లో పూర్తి వీడియోను షేర్ చేసింది.
Also Read: Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
మత్తు మందు చల్లి...
వీడియోలో కనికా మాట్లాడుతూ.. నేను ఢిల్లీ నుంచి గౌహతికి 'బ్రహ్మపుత్ర మెయిల్' లోని సెకండ్ ఏసీ కోచ్‌లో ప్రయాణించాను. అయితే ట్రైన్ పశ్చిమబెంగాల్‌లోని న్యూ జలైప్‌గురి జంక్షన్ ర్వేల్వే స్టేషన్ వద్ద ఆగిన సమయంలో దోపిడీ జరిగింది. ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి సీట్ నంబర్ గురించి అడగడంతో మాట్లాడుతూ ఉన్నాను. అంతలోనే అతడు నాపై ఏదో స్ప్రే చల్లాడు. తర్వాత నాకేమి అర్థం కాలేదు. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి నా ఐఫోన్ ప్రో మాక్స్ పోయింది అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియోకు రైల్వే పోలీసులను ట్యాగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరింది కనికా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు