ఇండియా గేట్ ముందు టవల్ తో.. మోడల్ వైరల్ వీడియో

కోల్‌కతా మోడల్ సున్నతి మిత్రా ఇండియా గేట్ ముందు పబ్లిక్ లో కేవలం టవల్ చుట్టుకొని డాన్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక చారిత్రాత్మక కట్టడం ముందు ఇలాంటి పిచ్చి రీల్స్ చేయడమేంటి అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.

New Update
india gate

girl dancing with towel India gate

Viral Video: ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో  రీల్స్, యూట్యూబ్ వీడియోలతో క్షణాల్లో ఫేమస్ అయిపోతున్నారు. కొంతమంది తమ క్రియేటివ్ కంటెంట్ తో ఫాలోవర్లను పెంచుకుంటుంటే .. మరికొంతమంది మాత్రం ఫేమస్ అవడానికి ఏది పడితే అది చేస్తుంటారు. ఇన్స్టా లో లైకులు, షేర్ల కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పనే చేసింది కోల్‌కతా మోడల్ సన్నతి మిత్రా. 

Also Read:ఓటీటీలో ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. మీరు చూశారా..?

ఇండియా గేట్ ముందు టవల్ తో.. 

సన్నతి మిత్రా ఒంటిపై కేవలం టవల్ చుట్టుకొని ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు బాలీవుడ్ పాటకు డాన్స్ రీల్ షూట్ చేసింది. ఆ సమయంలో పర్యాటకులు అంతా అక్కడే ఉన్నారు. ఈ వీడియోను సన్నతి మిశ్రా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హ్యాపీ ఇంటర్ నేషనల్ మెన్స్ డే.. సానుభూతితో ఇతరులను ఉత్తేజపరచడం, ప్రోత్సహించడం కొనసాగించండి  అంటూ రీల్ ను పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ కావడంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియా గేట్ ముందు ఈ విధమైన పిచ్చి రీల్స్ చేయడమేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సన్నతి మహిళల సంరక్షణ తమ వేషధారణ పై ఆధారపడి ఉంటుందా..? అంశాన్ని చెప్పడానికి ప్రయోగాత్మకంగా ఈ రీల్ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి రీల్స్ చేయడాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. 

Also Read:నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్‌.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్

Also Read:అమ్మాయే కోహినూర్ డైమండ్ గా పుడితే ఇలానే ఉంటుందేమో.. శ్రీలీలను ఇలా చూస్తే..

Advertisment
తాజా కథనాలు