/rtv/media/media_files/2025/02/16/rMOlk6rzFKxtqXpptAA8.jpg)
sreeleela bollywood debut
Sreeleela: ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రీలీల ఒకటి. మొదటి సినిమాతోనే తన నైపుణ్యంతో వరుస అవకాశాలను అందుకుంది. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఓవైపు టాలీవుడ్ లో రాణిస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇటీవలే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. కార్తిక్ ఆర్యన్ సరసన ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నట్లు టీజర్ విడుదల చేశారు.
తొలి సినిమాకే కోట్లలో
ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాలో శ్రీలీల రెమ్యునరేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందీలో తన తొలి చిత్రం కోసం శ్రీలీల రూ. 1.5 కోట్ల నుంచి ₹2 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప2 లో 'కిసిక్' ఐటమ్ సాంగ్ తో శ్రీలీల క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఆమె మార్కెట్ వ్యాల్యూ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. తొలి చిత్రానికే కోట్లలో రెమ్యురేషన్ తీసుకుంటూ హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటోంది ఈ బ్యూటీ.
Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ సరసన రాబిన్హూడ్ సినిమాలు చేస్తోంది. ఇటీవలే 'రాబిన్హూడ్' నుంచి విడుదలైన 'Wherever You Go' సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. డిఫరెంట్ బ్రాండ్ పేర్లను ఉపయోగించి వినూత్నంగా రూపొందిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. GV ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వెంకీ కుడుముల తెరకెక్కించిన 'రాబిన్హూడ్' మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Shruti Hasan: శృతి హాసన్ హాలీవుడ్ ఎంట్రీ.. 'The Eye' ట్రైలర్ చూశారా?
Also Read: Kubera Movie Updates: ధనుష్, నాగార్జున వార్.. కుబేర రిలీజ్ డేట్ వచ్చేసింది!