/rtv/media/media_files/2025/03/15/WJwfpZEa40KSEaM6wfex.jpg)
kid playing with snake
Viral Video: సాధారణంగా చిన్నపిల్లల ముందు ఏదైనా ఉంచితే.. వాటిని వెంటనే పట్టుకోవడం చేస్తుంటారు. అదేంటో వారికి తెలియదు కావున నిర్భయంగా వాటిని ముట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక చిన్నపిల్లవాడు తన ముందు ఉన్నది బొమ్మ అనుకోని ఒక విహపూరితమైన పాముతో ఆడుకుంటూ కనిపించాడు.
పాముతో పిల్లవాడు..
అయితే ఒక పిల్లవాడు కుర్చీపై కూర్చొని ఉండగా.. పాము కూడా అదే కుర్చీలో ఉంది. పిల్లవాడు అదొక బొమ్మ అని భావించి దానితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. పాము తలను చేతిలో పట్టుకొని అటు ఇటూ తిప్పడం చేశాడు. ఆ తర్వాత పాము కదలడంతో పిల్లవాడు తన తప్పును గ్రహించాడు. భయంతో అరవడం మొదలు పెట్టాడు. కుర్చీలో నుంచి కిందకు జారుకున్నాడు. మరోవైపు పాము కూడా కుర్చీ పై నుంచి దిగిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవాడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంతలో సమీపంలోని ఓ వ్యక్తి వచ్చి.. పిల్లవాడికి హానీ జరగకుండా పామును సురక్షితంగా బంధించాడు.
@vivek_choudhary_snake_saver అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. లక్షలాది వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పిల్లవాడి పేరెంట్స్ అజాగ్రత్త పై నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది వీక్షణల కోసం పిల్లలను ప్రమాదంలో పడేసే పనులు చేయడం మానేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి