Viral News: సంతాన బావి.. ఈ నీళ్లు తాగితే కవల పిల్లలు.. ఆ ఊరంతా వాళ్లే!

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని బావి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బావి నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారనే నమ్మకం కొన్ని సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదు ఆ ఊళ్ళో 130 పైగా కవుల జంటలు ఉన్నారు.

New Update
twins well rajamahendravaram doddigunta

twins well rajamahendravaram doddigunta

Viral News:  ఈ గ్రామంలో ఎక్కడ చూసిన కవల పిల్లలే కనిపిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 130 పైగా కవుల జంటలు ఉన్నాయి. దీనికి కారణం ఆ ఊరి బావి నీళ్లు! ఏంటి.. బావి నీళ్లకు, కవలలకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే.  తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఈ బావి చాలా ఫేమస్. ఈ బావి నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారనే నమ్మకం కొన్ని సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఊళ్ళో  ఒకే పోలీకలతో అన్నదమ్ములు, అక్కా చెల్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతేకాదు కాదు ఆ ఊరికి చెందిన  అబ్బాయిని పెళ్లి చేసుకున్న వారికి కూడా కవలలు పుడతారని చెబుతారు. 

బావి నీటితో కవల పిల్లలు 

ఇది కాస్త సోషల్ మీడియాలో, వార్తల్లో వైరల్ కావడంతో.. పక్క ఊళ్ళ నుంచి జనం కూడా ఆ బావికి క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తాగడమే కాకుండా, బాటిళ్లు, టిన్నుల్లో నీళ్లు తీసుకెళ్తుంటారు. అంతేకాదు విదేశాల్లో ఉండేవారు సైతం ఈ నీటిని దిగుమతి చేసుకుంటున్నారని సమాచారం.  మరో విశేషం ఏంటంటే.. ఈ బావి నీరు తాగితే రోగాలు నయమవుతాయని అక్కడి గ్రామస్థుల నమ్మకం. అయితే నిపుణులు మాత్రం.. నీళ్లు తాగితే కవలలు పుడతారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. వైజాగ్, హైదరాబాద్ వంటి అనేక ల్యాబ్ లలో ఈ నీటిని టెస్ట్ చేయించడం కూడా జరిగింది. కానీ వాటిలో ఎలాంటి ప్రత్యేక కనిపించలేదు. అయినప్పటికీ బావి దగ్గరకు వచ్చే జనాలు సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు