Viral Girl: 800 నుంచి 3లక్షల ఫాలోవర్లు.. రెండు కంపెనీలతో టై- అప్ .. ధోని ఫ్యాన్ గర్ల్ అరాచకం

ఆర్యప్రియ భుయాన్ అనే అమ్మాయి ఇటీవలే CSK ,RR మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో MS ధోనికి  ఔట్‌పై ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ తెగ వైరలయింది. అదే ఇప్పుడు ఆ అమ్మాయికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 800 గా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్  ఒక్కసారిగా  3,00,000కి పెరిగిపోయారు.

New Update
csk match viral girl

csk match viral girl

Viral Girl: సాధారణంగా క్రికెట్ స్టేడియంలో తమ ఫెవరెట్ బ్యాటర్స్ అవుట్ అయినప్పుడు ఫ్యాన్స్ మోహంలో కనిపించే ఎక్స్ ప్రెషన్స్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు ఫొటోగ్రాఫర్లు. ఇప్పుడు ఇలాంటి ఎక్స్ ప్రెషనే ఓ అమ్మాయిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. 'ఊప్స్' నుంచి హ్యాపినెస్ తో వావ్ అనేలా చేసింది. అయితే ఆర్యప్రియ భుయాన్ అనే అమ్మాయి ఇటీవలే CSK ,RR మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో MS ధోనికి  ఔట్‌పై ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు ఆఅమ్మాయికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

ఒక్క ఎక్స్ ప్రెషన్ తో బంపర్ ఆఫర్ 

ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవడంతో ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ దొరికింది.  800 గా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్  ఒక్కసారిగా  3,00,000కి పెరిగిపోయారు. అంతేకాదు పలు బ్రాండ్స్ ఆమెను తమ బ్రాండ్ ప్రమోటర్ గా సెలెక్ట్ చేసుకున్నాయి. స్విగ్గీ, యస్ మేడం వంటి కొరియన్ బ్రాండ్ ప్రమోటర్ గా ఒప్పందాలు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె సోషల్  మీడియాలో వీడియోను పంచుకుంది.  "ఊప్స్ నుంచి హ్యాపీ మోమెంట్" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 19 ఏళ్లవయస్సులోనే  పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్ అయ్యింది అని కొందరు చెప్పగా, మరొకరు ధోనితో ఆమె కెరీర్ ప్రారంభమైంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

latest-news

Also Read:This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?

Advertisment
తాజా కథనాలు