/rtv/media/media_files/2025/04/07/kHWEL1zzWTf944WR01xA.jpg)
vijay devarakonda- rashmika
Vijay- Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ అధికారికంగా అనౌన్స్ చేయనప్పటికీ.. తరచూ వీరు షేర్ చేసే ఫొటోల ద్వారా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. రష్మిక విజయ్ ఇంట్లో పండగలు సెలెబ్రేట్ చేసుకోవడం, ఇద్దరు కలిసి లంచ్ డేట్ కి వెళ్లిన ఫొటోలు ఆమధ్య తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.
మరోసారి
ఇటీవలే రష్మిక తన పుట్టినరోజు సందర్భంగా ఒమన్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కాగా, ఆ తర్వాత రోజు విజయ్ కూడా బీచ్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అయితే వీరిద్దరూ విడివిడిగా ఫొటోలు షేర్ చేసినప్పటికీ.. వాటిలో ఉన్నబ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండడం గమనార్హం. ఇద్దరూ బీచ్ లో ఉన్నారు. అలాగే ఇద్దరి ఫొటోల్లో తెల్లటి ఇసుక, నీలం గొడుగులు, తాటి చెట్లు కామన్ గా ఉన్నాయి. దీంతో వీరు ఒకే చోట వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి ఇలా ఫొటోలతో హింట్ ఇస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
telugu-news | cinema-news | latest-news | vijay-devarakonda-rashmika